కుక్కల దాడిలో ఐదు మేకపోతులు మృతి
29-05-2026 01:23 PM
ఆదుకోవాలని బాధితుడి విన్నపం
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ బర్కత్పురా కాలనీ చెందిన మజార్ అనే వ్యక్తికి చెందిన ఐదు మేకలను కుక్కలు దాడి చేసి చంపేసినట్లు బాధితులు మజార్ తెలిపారు. బక్రీద్ రోజున అర్ధరాత్రి తన ఇంట్లో ఉన్న మేకపోతులను కుక్కలు దాడి చేసి చంపేసినట్లు బాధితుడు లబోదిబోమన్నాడు. సుమారు 60000 నష్టం వాటిల్లిందని కుక్కలను అరికట్టడంలో మున్సిపాలిటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బాధితులు గోడువెల్లబోసుకున్నాడు. తనను ఆదుకోవాలని విన్నవించారు.






