27 July, 2026 | 1:15 AM

‘కాంటిరన్ 2026’ ఫిట్‌నెస్ రన్

27-07-2026 12:20 AM

గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్స్ వద్ద నిర్వహించిన ‘కాంటిరన్ 2026’ ఫిట్నెస్ రన్ విజయవంతంగా జరిగింది. కాంటినెంటల్ హా స్పిటల్స్ ఇంటర్నల్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది పాల్గొన్నారు.

రన్ ఫర్ యువర్ హెల్త్  రన్ ఫర్ ఎ ఫిట్ కమ్యూనిటీ నినాదంతో 2కే ఫన్ రన్, 5కే టైమ్డ్ రన్ నిర్వహిం చారు. సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం రమేష్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సీఐఎస్‌ఎఫ్ డీఐజీ అజయ్ కుమార్, సినీ నటుడు శ్రీ విష్ణు, నటి ప్రగతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డాక్టర్ ఎం రమేష్, కాంటినెంటల్ హాస్పిట ల్స్ డైరెక్టర్ రఘు ఎన్. రెడ్డి, నటి ప్రగతి కలిసి రన్‌ను ప్రారంభించారు.

5కే టైమ్డ్ రన్‌లో రాజేశ్వరి తొలి స్థానం, రామ్లక్కన్ సింగ్ ద్వితీ య స్థానం, ఎం ఉమ తృతీయ స్థానం సాధించగా, 2కే ఫన్ రన్‌లో ఆకాష్ మొదటి స్థానం, నాయుడు రెండో స్థానం, ప్రదీప్ మూడో స్థానంలో నిలిచారు. విజేతలకు నగ దు బహుమతులు, పతకాలు, ప్రశంసా ప త్రాలు అందజేశారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ డైరెక్టర్ రఘు ఎన్. రెడ్డి మాట్లాడుతూ, క్రమమైన వ్యాయామం ద్వారా మధుమే హం, రక్తపోటు, గుండె సంబంధిత జీవనశైలి వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. వ్య వస్థాపకులు, ఛైర్మన్ డాక్టర్ గురు ఎన్. రెడ్డి తన సందేశంలో ప్రతిరోజూ కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలని పిలుపునిచ్చారు.