26 May, 2026 | 5:31 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

తొలి విడత పంచాయతి పోలింగ్‌కు సర్వం సిద్ధం

10-12-2025 07:25 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్న తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. గురువారం జరిగే పంచాయతీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా పోలీసు శాఖ భద్రత, శాంతిభద్రతల చర్యలను చేపట్టిందని ఆమె పేర్కొన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, తొలి విడతలో మొత్తం 189 మండలాలు, 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డులు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 37,562 పోలీంగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, ఈ ఎన్నికల్లో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 27,41,070 మంది పురుషులు, 28,78,159 మంది మహిళలు, 201 మంది ఇతరులు ఉన్నారు. మొదటి దశలో 395 గ్రామాలు, రెండవ దశలో 495 గ్రామాలు ఇప్పటికే తమ ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయని ఎస్ఈసీ తెలియజేసింది. ఇప్పటివరకు అధికారులు తనిఖీల సమయంలో రూ.8.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారని, మొత్తం 50,000 మంది సివిల్ పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారని, భద్రతను పటిష్టం చేయడానికి బయటి నుండి 60 ప్లాటూన్లను రప్పించామని ఎన్నికల కమిషన్ తెలిపారు.