ముగిసిన జనగణన ఫస్ట్ విడత శిక్షణా తరగతులు
2027 జనగణన నిర్వహించడంలో శిక్షణ కీలక పాత్ర పోషిస్తుందన్న
ఆర్డీవో పార్థసారథి, తహసీల్దార్ కృష్ణయ్య
చేవెళ్ల ఏప్రిల్ 21(విజయక్రాంతి): చేవెళ్ళ మండల కేంద్రంలో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (HLO 2027) జనగణనపై ఎన్యూమరేటర్లు సూపర్ వైజర్లకు నిర్వహించిన మూడురోజుల మొదటి విడత శిక్షణా కార్యక్రమం మంగళవారం విజయవంతంగా ముగిసింది.
ఈ ముగింపు కార్యక్రమానికి చేవెళ్ల ఆర్డీవో పార్థసారథి, తహశీల్దార్ ఆర్. కృష్ణయ్య, మండల విద్యాధికారి పురందాసు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు విలువైన సూచనలు అందించారు. అనంతరం వారు ప్రకటన విడుదల చేశారు. రాబోయే 2027 జనగణనను పకడ్బందీగా నిర్వహించడంలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఫీల్ ట్రైనర్లుగా పాపగారి ఆశీర్వాదం, ఆర్. అక్షయ్ కుమార్ వ్యవహరించి గణన ప్రక్రియపై ఉపాధ్యాయులకు సమగ్ర అవగాహన కల్పించారు. శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఆసక్తితో తమ శిక్షణను పూర్తి చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






