ప్రభుత్వ బాలికల స్కూల్లో అగ్నిమాపక వారోత్సవాలు
చేవెళ్ళ ఏప్రిల్ 20(విజయక్రాంతి): చేవెళ్ళ మునిసిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. చేవెళ్ల అగ్నిమాపక స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణం చేపట్టాల్సిన చర్యల ఫైర్ ఫైటర్స్ స్వయంగా చేసి చూపించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మాల్స్ కార్యాలయాలు పాఠశాలలో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. విన్యాసాలు చేసిన ఫైర్ ఫైటర్స్ అనంతరం విద్యార్థుల చేత చెలరేగిన ఫైర్ ని ఎలా ఆపాలో ప్రాక్టికల్స్ గా చూపించి అప్రమత్తంగా ఉండేందుకు జాగ్రత్తలు తెలిపారు. ముఖ్యంగా ఈ వేసవికాలంలో గ్రామాలలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపారు.






