17 April, 2026 | 11:07 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు

17-04-2026 09:31 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): కేంద్ర మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించిన ప్రతిష్టాత్మక బ్రోంజ్ డిస్క్ అవార్డులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిమందిని ఎంపికచేసింది. కాగా అందులో హుజూర్ నగర్ ఫైర్ ఫైటర్ జుట్టుకొండ వెంకటేశ్వర్లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. సూర్యాపేట జిల్లా కీతవారిగూడెం గ్రామానికి చెందిన జుట్టుకొండ వెంకటేశ్వర్లు విది నిర్వహణలో చూపిన ధైర్య సాహసాలకు ఈ జాతీయ స్థాయి పురస్కారం లభించింది ఈ సందర్భంగా హుజూర్ నగర్ ఫైర్ ఆఫీసర్ పశ్యా సుబ్బిరాంరెడ్డి, సిబ్బంది, కీతవారిగూడెం గ్రామ పెద్దలు పలువురు ఆయనను అభినందించారు.