గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు
నార్కట్ పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి
చిట్యాల,(విజయక్రాంతి): ప్రమాదం జరిగిన వెంటనే ఇచ్చే సహాయం చాలా ముఖ్యమని, గోల్డెన్ అవర్ సమయంలో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చని నార్కట్ పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. శుక్రవారం నార్కెట్‌పల్లి పట్టణంలో గోల్డెన్ అవర్ రెస్పాన్స్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సై విష్ణు ఆధ్వర్యంలో, పోలీస్ శాఖ తరఫున మెడికల్ ఆఫీసర్ మరియు 108 సిబ్బంది సహకారంతో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలకు రోడ్డు ప్రమాదాలు మరియు అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత గురించి వివరించారు.
అలాగే సి పి ఆర్ (కార్డీయో పుల్మనరీ రెస్యూసైటేషన్ ) పద్ధతులను ప్రదర్శిస్తూ, ప్రమాద బాధితులకు వెంటనే సహాయం చేయడం ద్వారా ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చో వివరించారు. ఈ సందర్భంగా ఎస్సై విష్ణు మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే ఇచ్చే సహాయం చాలా ముఖ్యమని, గోల్డెన్ అవర్ సమయంలో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు. ప్రజలు ఇటువంటి అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, ప్రమాద బాధితులకు సహాయం చేసే విధంగా ముందుకు రావాలని సూచించారు.






