21 May, 2026 | 3:20 PM

Breaking News

తెల్ల తెల్లవారుతుండగానే పల్లెల్లోకి పాఠశాలల ప్రచారం.. విత్తన కంపెనీల ప్రచార రతాలు   •   ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరం   •   ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి..   •   ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకం   •   ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్   •   అనుమతి లేని ప్రైవేట్, విద్యాసంస్థలను మూసివేయాలి   •   కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్త్ టాపర్ కు సైకిల్ బహుకరణ...   •   జైనూర్‌లో చలివేంద్రం – అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు...   •   ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు   •  

మద్దిమడుగు అంజన్న చెంత.. అర్దరాత్రి అగ్నిప్రమాదం

21-05-2026 02:29 PM

ప్రమాదంలో దుకాణాలు ద్విచక్ర వాహనం దగ్ధం 

బాధితులకు తీవ్ర నష్టం 

అచ్చంపేట: నల్లమల్ల అభయారంగుల వెలసిన మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ సమేపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ మంటలు సంభవించడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా ఆలయాన్ని దర్శించుకుంటారు. స్థానికులు ఆలయ పరిసరాల్లో వివిధ దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు.

బురువారం అర్ధరాత్రి తర్వాత.. ప్రాంగణం సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక షాపులో మొదలైన మంటలు క్షణాల వ్యవధిలోనే పక్కనే ఉన్న మరో దుకాణానికి అంటుకున్నాయి. దీంతో ఆయా దుకాణాల్లోని పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, నగదు, నిత్యవసర వస్తువులు ఆగ్నికి ఆహుతయ్యాయి.

అర్ధరాత్రి కావడం.. మంటల తీవ్రత అధికంగా ఉండటంతో మంటలు ఆర్పేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఐదు షాపులు సామాగ్రితో సహా పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ప్రమాదంతో తమకు నష్టాలు లక్షల్లో వాటిలిందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాదం రాత్రి సమయంలో చోటు చేసుకోవడంతో స్థానికుల ఆహాకారాలతో ఆ ప్రాంగణమంతా బీతావాహంగా మారింది. 

ఘటన స్థలికి పోలీసులు

ప్రమాదం సమాచారం అందుకున్న పదర పోలీసులు, ఆలయ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం,  దేవస్థానం కమిటీ స్పందించి తమకు జరిగిన నష్టాన్ని గుర్తించి ఆదుకోవాలని కోరారు.

ప్రమాదస్థలికి ఎమ్మెల్యే 

మద్దిమడుగు జరిగిన ప్రమాదవ స్థానాలకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ వెళ్లారు. కాలిపోయిన దుకాణాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. బాధితులకు అన్ని విధాలుగా అందవుగా ఉంటామని ప్రభుత్వం తరఫున అవసరమైన సాయం అందిస్తామని స్పష్టం చేశారు.