9 April, 2026 | 8:26 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

తాండూరులో అగ్నిప్రమాదం

04-10-2025 09:20 AM

నాలుగు వెల్డింగ్ దుకాణాలు పాక్షికంగా దగ్ధం.

తాండూరు,(విజయక్రాంతి):  వికారాబాద్ జిల్లా తాండూర్(Tandoor) పట్టణం లో నేడు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రైల్వే బ్రిడ్జి సమీపంలోని రెడ్డి చికెన్ సెంటర్ వద్ద ఉన్న నాలుగు వెల్డింగ్ దుకాణాలకు (డబ్బాలు) నిప్పు అంటుకొని అగ్ని కీలలు ఎగసాయి. మంటలను చూసిన అక్కడ ఉన్నవారు వెంటనే అగ్నిమాపక(Fire Accident) శాఖకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ వారు మంటలను ఆర్పి వేశారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు నాలుగు నుండి ఐదు లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వెల్డింగ్ దుకాణ (డబ్బాల) యజమానులు కోరుతున్నారు.