15 June, 2026 | 2:47 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

డ్రాగన్ ఫ్రూట్ తోటలో అగ్నిప్రమాదం

10-06-2026 12:56 AM

శ్రీరంగాపూర్, జూన్ 9: శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామానికి చెందిన రైతు అంకె బాలయ్య తన వ్యవసాయ పొలంలో ఎకరాన్నర విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ తోటను సాగు చేస్తున్నారు. అయితే మంగళవారం అనూహ్యంగా తోటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఎలా వ్యాపించాయో తెలియరాలేదు. తోటలో ఉన్న ఎండిన గడ్డి అంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాపించి డ్రాగన్ ఫ్రూట్ తోటకు తీవ్ర నష్టం కలిగించాయి.

ఈ ప్రమాదంలో తోటలోని మొక్కలు, సపోర్టు స్తంభాలు, ఇతర సామగ్రి దగ్ధమై భారీ నష్టం వాటిల్లింది. డ్రాగన్ ఫ్రూట్ సాగుపై సుమారు రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతు అంకె బాలయ్య తెలిపారు. ఒక్కసారిగా తోట మొత్తం అగ్నికి ఆహుతి కావడంతో రైతు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ అగ్నిప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకుని తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.