5 June, 2026 | 9:23 PM

డ్రంక్ అండ్ డ్రైవ్ లో రూ.3 లక్షలు జరిమానా

05-06-2026 08:18 PM

- డ్రైవింగ్ లైసెన్స్ లేని 18 మందికి రూ.90వేలు ఫైన్

సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బందితో కలిసి కొన్ని రోజుల క్రితం వాహనాలు తనిఖీ చేయగా, 28 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా పట్టుకున్నామని ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు తెలిపారు. శుక్రవారం వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచినట్టు చెప్పారు. న్యాయమూర్తి విచారణ జరిపి  28 మందికి రూ. మూడు లక్షల జరిమానా విధించినట్టు తెలిపారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ, పట్టుబడిన 18 మందికి రూ.90 వేలు జరిమానా విధించారని పేర్కొన్నారు.