09-02-2026 01:08:01 AM
చేవెళ్ల, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఓట్ల కోసం రేవంత్‌ఖాన్‌గా చెప్పుకునే స్థాయికి దిగజారారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టి ధైర్యం లేకనే.. మున్సిపల్ ఎన్నికలు పెడుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికలు పార్టీ గుర్తుపైనే అయినప్పటికీ పట్ట ణ ప్రాంతాల్లో మైనార్టీ ఓట్లతో గెలవచ్చనే భావనతో ఉన్నారన్నారు.
ఆదివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన కార్న ర్ మీటింగ్‌కు ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిగులు బడ్జెట్‌తో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరిట అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు దోపీడీ చేసి రాష్ట్రా న్ని దివాలా తీయించారని విమర్శించారు.
కేసీఆర్ కూతురు కవిత 10 ఏండ్లలో ఏం చేశారని అడుగుతోందని ఎద్దేవా చేశా రు. ప్రస్తుతం తెలంగాణలో ఆర్థిక సంక్షోభం నెలకొందని, ఇచ్చిన హామీలు అమలు చేయ లేదని పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గట్టెక్కాలంటే బీజేపీతోనే సాధ్యమని, అందుకే కమలం పువ్వుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ది మాట తప్పే స్వరూపం అని, మాట నిలబెట్టుకునే పార్టీ బీజే పీ అని స్పష్టం చేశారు. ఓటు అడిగేందుకు వస్తే కాంగ్రెస్ నాయకులను నిలదీ యాలని పిలుపునిచ్చారు.
మూడు హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు
కేంద్ర బడ్జెట్‌లో రూ.7 లక్షల కోట్లతో 7 రైల్వే ప్రాజెక్టులు ప్రతిపాదిస్తే అందులో మూడు తెలంగాణలోనే ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. రూ.3.6 లక్షల కోట్లతో హైదరాబాద్ నుంచి పూనె వరకు, హైదరారాబాద్ నుంచి చైన్నై, హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా ద్వారా బెంగళూరు వరకు హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్లు ఏర్పా టు చేయనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ఇప్పటికే రూ.1.50 లక్షల కోట్లతో నేషనల్ హైవేలు నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్ర కార్యకలాపాలను అరికడుతున్నామని, సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ ఇందుకు నిదర్శనమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణ మోహన్, జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్‌గౌడ్, మాజీ ఎంపీపీ విజయ లక్ష్మీరమణారెడ్డి, మున్సిపల్, మండల అధ్యక్షులు అనంత్‌రెడ్డి, శ్రీకాంత్, మాజీ అధ్యక్షు డు పాండురంగారెడ్డి, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్, నేతలు ప్రభాకర్‌రెడ్డి, వైభవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.