calender_icon.png 20 February, 2026 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టకాలంలో అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు

20-02-2026 07:10:11 PM

స్నేహానికి నిదర్శనం… 

తోటి స్నేహితుడి కుటుంబానికి రూ.45,600 ఆర్థిక సాయం

చివ్వెంల,(విజయక్రాంతి): మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన నకెరికంటి సతీష్ ఇటీవల జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన కుటుంబానికి తోటి స్నేహితులు మానవత్వాన్ని చాటుతూ ఆర్థిక సహాయం అందించారు. శుక్రవారం 2006–07 సంవత్సరాల పూర్వ విద్యార్థులు కలిసి సతీష్ భార్య, ఇద్దరు పిల్లలకు రూ.45,600 నగదు సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ... సహాయం కోరిన వెంటనే ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మనస్ఫూర్తిగా సహకరించడం అభినందనీయమని తెలిపారు. కష్టకాలంలో ఒకరికి ఒకరు అండగా నిలవడం నిజమైన స్నేహబంధానికి నిదర్శనమని పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి సహాయ సహకారాలు మరింత పెరగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మల్లెబొయిన వీరస్వామి, బొల్లికొండ సతీష్, నకరికంటి అశోక్, బొల్లికొండ గోపి, కొప్పు నాగరాజు, బొల్లికొండ సురేందర్, కొల్లూరి నరేష్, గోనెల నాగరాజు, మహిపాల్ రెడ్డి, లింగారెడ్డి, నాగార్జున, సుధీర్, సైదిరెడ్డి, మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.