1 May, 2026 | 4:10 AM

బీజేపీ ఆధ్వర్యంలో మండల టాపర్ శ్రీదీప్ ఆర్థిక సహాయం అందజేత

01-05-2026 02:29 AM

నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షల్లో మండల టాపర్గా సాధించిన విద్యార్థి రంగి శ్రీదీప్కు మండల బిజెపి నాయకురాలు కొండ మీరాతాయి బిజెపి నాయకులతో కలిసి శాలువాతో సన్మానించి మూడు వేలు,, ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మండల బిజెపి నాయకురాలు కొండ మీరాతాయి మాట్లాడుతూ... చినూరు గ్రామానికి చెందిన రంగి శ్రీదీప్ పదవ తరగతి పరీక్షల్లో మండల్ టాపర్గా నిలిచి 600 మార్కులకు 574 మార్కులు సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని తమ గ్రామాన్ని మండల,జిల్లా స్థాయిలో తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఇలాగే రాబోయే రోజుల్లో కూడా తండ్రి ఆశయాలను సాధించాలని ఉన్నత చదువులు చదవాలని తెలిపారు.శ్రీదీప్ విద్యార్థికి పూర్తి సహాయ సహకారాలు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు హనుమాన్లు,కిషన్,ఓం కృష్ణ తదితరులు ఉన్నారు.