6 May, 2026 | 2:37 AM

పెళ్లి కూతురికి ఆర్థిక సహాయం

06-05-2026 12:00 AM

మేడ్చల్ అర్బన్, మే 5  (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలోని 24 వ వార్డు బిజెపి కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ దంపతులు మూర్గాని మాధవి శ్రీనివాస్ కూతురు పూజకు 28000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు పెళ్లి కూతుర్లకు పుస్తే మట్టెలతో పాటు ఆర్థిక సహాయం చేస్తే ఎల్లకాలం గుర్తుంచుకుంటారని చెప్పారు.

గత 12 సంవత్సరాలుగా కొత్తగా పెళ్లి చేసుకుంటున్న ఆడ బిడ్డలకు తనకు తోచిన కాడికి పుస్తే మట్టెలతో పాటు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ దంపతులు వెల్లడించారు.అనంతరం పెళ్లి కూతురు తల్లి తండ్రులు మూర్గాని మాధవి శ్రీనివాస్ లు మాట్లాడుతూ తన కూతురు వివాహానికి ఆర్థిక సహాయం చేసిన బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తు భగవంతుడు వారికి అష్ట ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకున్నట్లు తెలిపారు.