15 June, 2026 | 4:56 PM

కిరాతకుడుని ఉరితీయాలి..

15-06-2026 03:27 PM

బాలిక కుటుంబానికి 50 లక్షలు చెల్లించాలి..

ఉట్నూర్ అంబేద్కర్ చౌరస్తాలో బీసి సంఘాలు మరియు కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన.. కుల సంఘాల డిమాండ్..

ఉట్నూర్,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటనలో కిరాతకుడిని ఉరితీయాలని, బాలిక కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని బీసీ కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఉట్నూర్ మండల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  చౌక్ వద్ద  నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుల సంఘాల నాయకులు మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ పోరాట సమితి మండల కన్వీనర్ సీపతి లింగా గౌడ్ మాట్లాడుతూ.. ఖమ్మంలో 12 ఏళ్ళ పసిపాపను అఘాయిత్యం చేసి నాలుగు అంతస్తుల భవనంపై నుండి కిందకు తోసేసిన కిరాతకుడు మొహ్మద్ గౌస్ పాషా గాడిని ఉరి తీయాలని డిమాండ్ తో నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన తెలపడం జరిగింది.

ఒక పేద చాకలి కుటుంబానికి చెందిన పాపను ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ లుచ్ఛాన కొడుకును తక్షణమే ఉరి తీస్తూ, ఆ పేద బాలిక కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తు ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ తో నిరసన తెలపడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఏ వెధవ అయిన పసి పిల్లల జోలికి వెళ్లాలంటే వనుకు పుట్టాలి. ఇదే ఒక అగ్ర వర్ణాల కుటుంబానికి ఇలా జరిగితే రాష్ట్రం అగ్ని గుండం అయ్యెది. ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రక్షణ లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాడిని ప్రజా కోర్టులో నిలబెట్టి మీ చిత్తశుద్ధిని నిలబెట్టుకోవాలి లేని పక్షంలో అన్ని కుల సంఘాలతో కలిసి భవిష్యత్తు ప్రణాళికను నిర్వహిస్తాం