28 April, 2026 | 3:01 AM

ఎరువుల దుకాణాలు సంపూర్ణ బంద్

28-04-2026 01:27 AM

ఆళ్ళపల్లి, ఏప్రిల్ 27, (విజయక్రాంతి): రాష్ట్ర ఎరువుల దుకాణదారుల అసోసియేషన్ పిలుపులో భాగంగా సోమవారం ఆళ్లపల్లి మండలంలో ఎరువుల దుకాణాలు సంపూర్ణ బంద్  విజయవంతమైనది ఈ మేరకు మండల పరిధిలోని 22 ఎరువుల దుకాణదారులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దుకాణాలు బంద్ చేసి సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారస్తులు గౌరిశెట్టి శ్రీనివాసరావు అబ్బు నాగేశ్వరరావు అనుమోల వెంకటేశ్వరరావు తాళ్లపల్లి నాగేశ్వరరావు బూరుగడ్డ రాముడు మాట్లాడుతూ  ఎరువుల ఉత్పత్తిదారులు ఎరువుల సరఫరా పై ఎఫ్ ఓ ఎల్ విధానం అనగా రవాణాచార్జీలు హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే ఎరువుల సరఫరాలో యూరియా డిఎపి వాటితోపాటు లింకు విధానంతో వివిధ ఉత్పత్తులను అంట కట్టి ఇటు డీలర్లకు రైతులకు అదనపు భారం మోపటం సరైంది కాదని వెంటనే లింకు విధానాన్ని తొలగించాలని  అలాగే డీలర్లకు మార్జిన్ న పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎరువుల దుకాణదారుడు ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వ్యాపారులు సంకా ప్రభాకర్ బూరుగడ్డ వెంకటేశ్వర్లు నువ్వుల నరసింహారావు జార భాస్కర్ పాల్గొన్నారు.