20 April, 2026 | 2:39 AM

హైకోర్టు బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడికి సన్మానం

20-04-2026 12:37 AM

బోథ్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): తెలంగాణ హైకోర్టు బార్ ఆసోసియేషన్ అధ్యక్షులు, న్యాయవాది సింగిడి సురేందర్ రెడ్డిని ఆయన స్వగ్రామమైన కౌటా (బి) గ్రామంలో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం గ్రామస్తుల కోరిక మేరకు ఆయన పుట్టి పెరిగిన గ్రామానికి తొలిసారిగా రావడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయనను గ్రామ సర్పంచ్ ఓరుగంటి స్వామితో పాటు, గురుడకాపు సంఘం, మున్నూరు కాపు సంఘం, గ్రామ అభివృద్ధి కమిటీ, యువజన సంఘాల ఆధ్వర్యంలో, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత,  బార్ ఆ సోసియేషన్ అధ్యక్షులు న్యాయవాది సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు చూపించిన ఆధార అభిమానులను మరవలేమని గ్రామానికి భవిష్యత్తులో సేవ చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.