ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సన్మానం
కొత్తపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామంలో లబ్ధిదారులు మేగాని రాజు - సరిత, కట్ల సతీష్ - మానస దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలు, చీరె-సారె పెట్టి సన్మానించి, వారి ఇండ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ... ఈ రాష్ట్రంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్నదే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన వారికి కి గౌరవప్రదమైన జీవనం కల్పిస్తున్నామని అన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి, స్థానిక నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కొత్తపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంజాల స్వామి గౌడ్ పాల్గొన్నారు.






