24 July, 2026 | 4:08 AM

ఫీజు బకాయిలు విడుదల చేయాలి

24-07-2026 12:34 AM
  1. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 
  2. ‘ఫీజుల బకాయి-బీజేపీ లడాయి’ పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి) : ఫీజు రీయింబర్స్‌మెంట్  బకాయిల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యండి వ్యవహరిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మం డిపడ్డారు. ఫీజుల విషయంలో రాష్ట్ర ప్ర భుత్వం  అవలంబిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా, విద్యార్థుల న్యాయమైన హక్కుల ను సాధించేందుకు బీజేవైఎం ఆధ్వర్యం లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ‘  ఫీ జుల బకాయి-బీజేపీ లడాయి’ ఉద్యమానికి సంబంధించిన పోస్టర్‌ను బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, యువమోర్చ రాష్ట్ర అధ్య క్షులు గణేష్ కుండేతో కలిసి గురువారం రాంచందర్‌రావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెం టనే విడుదల చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను చైతన్యపరుస్తూ వివిధ దశల్లో ఉద్యమ కార్యాచరణ చేపడుతామన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పటీ వకు ఉద్యోగాలు లేవు... జాబ్ క్యాలెండర్ లేదన్నా రు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెం ట్ బకాయిలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి భవిష్యత్తు అనిశ్చి తిలో పడిందని, అందుకే విద్యార్థుల న్యా యమైన హక్కు కోసం భారతీయ జన తా యువమోర్చా ఈ అంశాన్ని ఉద్యమంగా చేపట్టిందన్నారు. జిల్లాల వారీగా ప్రతి విద్యార్థికి అండగా నిలుస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.