calender_icon.png 15 February, 2026 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడుకును పరీక్ష రాయించాలని తండ్రి ఆందోళన

14-02-2026 12:00:00 AM

చైతన్యపురిలో అనుమతి లేని కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం 

ఎల్బీనగర్, ఫిబ్రవరి 13 : అనుమతి లేకుండా కళాశాల నిర్వహించి, విద్యార్థుల జీవితాలతో యాజమాన్యాలు ఆటలాడుతున్నాయి. తన కుమారుడుని ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాయించాలని ఓ తండ్రి కళాశాల యాజమాన్యంతో ఆందోళనకు దిగాడు. వివరాల్లోకి వెళ్తే... చైతన్యపురి లోని అల్లెన్ కళాశాలలో శ్రీతన్ ఆయన్ అనే విద్యార్థి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

ఈ కళాశాలకు అనుమతి లేకపో వడం ద్వారా దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటేశ్వర జూనియర్ కళాశాల ద్వారా పరీక్ష రాయిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చిం ది. ఎలాగైనా సరే పరీక్ష రాయించమని కోరగా వెంకటేశ్వర కాలేజీ యాజమాన్యం విముఖత చూపింది. తద్వారా శ్రీతన్ ఆయన్ పరీక్ష రాయడానికి అనర్హుడు అయ్యాడు.

దీంతో విద్యార్థి తండ్రి జాగృతి విద్యార్థి సంఘం బహుజన స్టూడెంట్ తదితర సంఘాలతో కలిసి శుక్రవారం కళాశా లకు వచ్చి ఆందోళన చేశాడు. మావి దేశవ్యాప్తంగా కళాశాలలు ఉన్నాయని, మరో రాష్ట్రం నుండి పరీక్ష రాయిస్తామని అల్లెన్ కళాశాల యాజమాన్యం చెప్పగా విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.