14-02-2026 12:00:00 AM
మున్సిపల్ చైర్మన్‌గా కాసుల విజయ బాలరాజ్
బాన్సువాడ, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 19 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 11, బీఆర్‌ఎస్ 3, బీజేపీ 3, ఎంఐఎం 1, స్వతంత్ర 1 అభ్యర్థులు గెలుపొందారు. దీంతో కాసుల విజయ బాలరాజ్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.