అప్పుడే పాత్రకు న్యాయం చేసినట్టు!
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించారు. జూలై 3న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను హీరోయిన్ నభా నటేశ్ విలేక రులతో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. “డైరెక్టర్ అభిషేక్ నామా ‘నాగబంధం’ కథ చెప్పినప్పుడే మెస్మరైజ్ అయ్యా. ఇందులో నేను పార్వతి పాత్రలో కనిపిస్తా.
తను ఒక వేద విద్యార్థిని. బలమైన భావోద్వేగాలతో కూడిన పాత్ర ఇది. తన కుటుంబం కోసం, ప్రేమ కోసం ఎంతవరకైనా నిలబడే వ్యక్తిత్వం ఆమెది. నా పాత్రలో రొమా న్సూ ఉంటుంది. అయితే, నా పాత్ర లోని కొన్ని ముఖ్యమైన అంశాలే కథకు కీలక మలుపు తీసుకొస్తాయి. ఈ పాత్ర చేసినందుకు చాలా గర్వపడుతున్నా. ఇందులో చాలా గ్రాండ్‌గా చిత్రీకరిం చిన డాన్స్ నంబర్ ఉంది. దాదాపు 5,000 మంది డ్యాన్సర్లతో తీశారు. ఈ పాట కోసం వేసిన సెట్.. బృందావనంలో గోపికలంతా కలిసి ఆనందంగా వేడుక చేసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతే కలిగించింది.
నా పాత్ర కోసం సిద్ధం కావడానికి దాదాపు రెండు గంటలు పట్టేది. విరాట్‌తో కలిసి నటించడం చాలా మంచి అనుభవం. నిర్మాతలకు ఇది తొలి సినిమానే అయిన ప్పటికీ కంటెంట్‌పై నమ్మకంతో రాజీ పడకుండా సినిమాను తీర్చిదిద్దారు. ప్రమోషన్స్ కూడా చాలా వినూత్నంగా చేశారు. అనంత పద్మనాభస్వామి రథయాత్ర అనే ఆలోచన చాలా ప్రత్యేకంగా ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత -నాకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. స్క్రీన్‌పై ఎనర్జీతో కనిపించినప్పుడే పాత్రకు న్యాయం చేయగలనని భావిస్తా. అందుకే పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ నటించడం ప్రారంభించా”.






