15 August, 2026 | 3:48 PM

ఉప్పొంగిన జాతీయ భావం

15-08-2026 03:05 PM

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా 

అధికారుల నిర్లక్ష్యంతో త్రివర్ణ పతాకానికి అవమానం

పాపన్నపేట,ఆగస్టు15: మండల కేంద్రం పాపన్నపేట తోపాటు ఆయా గ్రామాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయితీలు, ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, ఆసుపత్రులు, వివిధ సంఘాల కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం(Etupayala Vanadurga Mata Temple) వద్ద ఆలయ అధికారులు జెండా ఆవిష్కరణ చేశారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాతను జాతీయ జెండా రంగుల పూలతో సుందరంగా అలంకరించడంతో వనదుర్గామాత శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతో త్రివర్ణ పతాకానికి అవమానం

కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, వ్యవసాయ శాఖ, ఎంపీడీవో కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్యంతో జాతీయ జెండాకు అవమానం జరిగింది. దీంతో నాయకులు, ప్రజలు వారిపై మండిపడ్డారు. కిందకు దించి మళ్లీ ఎగురవేశారు. కనీస నిబంధనలు అధికారులకు తెలియకపోవడం పై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మరల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు కోరారు.