15 August, 2026 | 3:55 PM

పాపన్నపేట ఎంపీడీఓకు జిల్లా స్థాయి పురస్కారం

15-08-2026 03:12 PM

పాపన్నపేట,ఆగస్టు15: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేస్తున్నందుకుగాను జిల్లా స్థాయిలో పాపన్నపేట ఎంపీడీవో విష్ణువర్ధన్ కు జిల్లా ఉత్తమ ఎంపీడీఓ అవార్డు లభించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సిబ్బంది అందరి సమిష్టి కృషితోనే జిల్లాస్థాయిలో ఉత్తమ ఫలితాలను రాబట్టడం జరిగిందన్నారు. ఇదే విధంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తానని ఆయన ఈ సందర్బంగా తెలిపారు.