calender_icon.png 19 February, 2026 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాంత్రికరణ పనిముట్లు రైతులు సద్వినియోగం చేసుకోవాలి

19-02-2026 03:45:42 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు.

తుంగతుర్తి,(విజయక్రాంతి): యాంత్రికరణ పనిముట్లు(Tools) రైతులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(Thungathurthi MLA Mandula Samel) అన్నారు. గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ సంచాలక కార్యాలయంలో యంత్ర పనిముట్లు రైతులకు సబ్సిడీపై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన పాలనలో  రైతులను ఆదుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ప్రజా పాన్లో భాగంగానే రైతులకు యాంత్రికరణ పనిముట్లు సుమారు 1 కోటి 11లక్షలు విలువగల పనిముట్లు, అందజేసినట్లు తెలిపారు.

ఫార్మర్ రిజిస్టర్, యూరియా యాప్ కూడా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి వ్యవసాయ శాఖ అధికారి అంకితభావంతో పని చేసినప్పుడే గుర్తింపు పొందాలని కోరారు. రానున్న ఎంపిటిసి జెడ్పిటిసి ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించుటకు కార్యకర్తలు సంసిద్ధులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు రమేష్ బాబు, తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు,మండల పార్టీ అధ్యక్షులు గోవర్ధన్, దాసరి శ్రీనివాస్, మల్లేష్, మామ్ సింగ్ ,అజయ్ కుమార్ ,అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.