calender_icon.png 19 February, 2026 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోనరావుపేటలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

19-02-2026 03:47:51 PM

కోనరావుపేటలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి(Chhatrapati Shivaji Maharaj Jayanti ) వేడుకలను భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మండల అధ్యక్షులు మిర్యాల్‌కార్ బాలాజీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, హిందూ ధర్మ రక్షణ కోసం, స్వరాజ్య స్థాపన కోసం శివాజీ మహారాజ్ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నేటి యువత శివాజీ మహారాజ్ ఆశయాలను అలవర్చుకుని దేశభక్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బైరగోని సురేష్ గౌడ్, ఉపాధ్యక్షులు చింతల పరశురాం, నాయకులు చీకటి మధు, విజయ్, దుర్ల శంకర్, శంకర్, పిల్లి వెంకటి, బాలరాజు, పారలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.