29 April, 2026 | 1:34 PM

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

27-04-2026 08:57 PM

ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లి, గొల్లపల్లి, సాంబయ్యపల్లి, దుబ్బపల్లి, ఐతరాజుపల్లి, గర్రెపల్లి, బొంతకుంటపల్లి గ్రామాలల్లో సోమవారం సాయంత్రం  వడ్ల కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో, రైతులతో కలిసి  ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు  మాట్లాడుతూ... రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న అన్నదాతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పాలకులు కోతల పేరిట రైతుల శ్రమను దోచుకున్నారని ఆరోపించారు.