23 June, 2026 | 4:02 PM

రైతులు విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోవాలి

23-06-2026 02:30 PM

మండల వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ 

చేర్యాల,జూన్ 23: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనమేళాను మంగళవారం నిర్వహించారు. ముఖ్యంగా ఈ విత్తన మేళాలో రైతులకు అవసరమైన వివిధ రకాల సన్న వడ్ల విత్తనములు,పప్పు దినుసుల విత్తనాల తోపాటు నానో యూరియా, డిఎపి వంటి ఎరువులు కూడా ఈ విత్తన మేళాలో అందుబాటులో ఉంచారు.

ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ మాట్లాడుతు రైతులు సన్నధాన్యం వైపు అధికంగా సాగు చేయాలని ప్రభుత్వం నిర్ధారించిన ఏడురకాల విత్తనాలు బీపీటీ,ఆర్ఎన్ఆర్,15048,కే ఎన్ఎం118,జై శ్రీ రాం,ఎచ్ఎంటీ, వరంగల్ 44 రకాలు మాత్రమే సాగుచేసి ప్రభుత్వం అందించే 500/-బోనస్  కూడా అందుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి,రైతులు శోకత్, ఆరిఫ్,ఎండీ తాజ్,సత్యనారాయణ,ఏఈఓ రాజు తదితరులు పాల్గొన్నారు.