భూములను సాగు చేస్తున్న రైతులను గుర్తించి భూ హక్కు పత్రాలు జారీ చేయాలి
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఏప్రిల్1 (విజయక్రాంతి): ఏళ్ల తరబడిగా భూములను సాగు చేసుకుంటున్న రైతులను గుర్తించి వారికి హక్కు పత్రాలు ఇవ్వాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. బుధవారం ఐడి ఓసి కార్యాలయంలో భూపాలపల్లి డివిజన్ పరిధిలోని రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూములకు హ క్కు పత్రాలు జారిపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలా ల వారిగా ప్రభుత్వ భూముల్లో సాగులో ఉన్న రైతులు, భూ సమస్యల వివరాలను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మారావుపేట గ్రామంలోని రైతులు దీర్ఘకాలంగా సాగు చేస్తున్న భూమిలో సింగరేణి గనులు ఏర్పాటుతో కొందరు రైతులు భూములు కోల్పోయారని వారికి పరిహారం అందించాలని సూచించారు. గనులు ఏర్పాటు తదు పరి మిగిలిన భూములను సాగు చేస్తున్న రైతులకు భూ హక్కు పత్రాలు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అలాగే సింగరేణి గనులు, జెన్కో పరిశ్రమ ఏర్పాటుతో భూములు కోల్పోయిన రైతుల కు పరిహారం చెల్లించాల్సి ఉందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూముల్లో ఏళ్ల తరబడి సాగుచే స్తూ జీవనం సాగిస్తున్న రైతులకు గ్రామ స భలు నిర్వహించడం ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి హక్కు పత్రాలు ఇవ్వా లని తెలిపారు. కోర్టు వివాదాల్లోని భూము లు జోలికి వెళ్లకుండా ఇతర భూములకు హక్కు పత్రాలు జారీ చేయాలని సూచించారు.
దాదాపు 70 సంవత్సరాలుగా సాగులో ఉన్న రైతులకు కోర్టు కేసులు లేని పక్షం లో గ్రామ సభల ద్వారా భూ హక్కు పత్రా లు జారీ చేయాలని తెలిపారు. భూ హక్కు పత్రాలు లేకపోవడం వల్ల రైతులు రైతు భ రోసా, రైతు భీమా వంటి ప్రయోజనాలను పొందలేకపోతున్నారని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ కోర్టు వివాదాలు లేని భూములను లైసెనస్డ్ సర్వేయర్ల ద్వారా సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, ఆర్డిఓ హరికృ ష్ణ, భూపాలపల్లి డివిజన్ పరిధిలోని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.




