22 April, 2026 | 12:04 PM

Breaking News

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •  

కాటన్ షెడ్డర్ పై రైతులకు అవగాహన..

18-12-2025 09:25 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): వ్యవసాయంలో వస్తున్నటువంటి ఆధునిక పద్ధతులను, యంత్ర పరికరాలను వినియోగాన్ని అనుసరించి లాభాల బాట పట్టాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం  శాస్త్రవేతలు రైతులకు సూచించారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద భారత ప్రత్తి పరిశోధన స్థానం, నాగపూర్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన అధిక సాంద్రత ప్రత్తి సాగు ప్రాజెక్ట్ లో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం,ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అధిక సాంద్రత ప్రత్తి సాగుపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కేవికే, బెల్లంపల్లి శాస్త్రవేతల సాద్వి మాట్లాడుతూ అధిక సాంద్రత పద్దతిలో ప్రత్తి సాగు విధానం యాజమాన్య పద్ధతులు, పాటించవలసిన మెలకువలు గురించి వివరించారు. తదనంతరం పత్తిలో వచ్చినటువంటి నూతన యంత్రం కాటన్ షేడ్డర్ గురించి రైతులకు అవగాహన కల్పించి ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. ఈ విదంగా వ్యవసాయంలో వస్తునట్టువంటి నూతన పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేతలు, రైతులు పాల్గొన్నారు.