1 July, 2026 | 6:38 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

రైతు భరోసా చారిత్రక ఘట్టం.. రైతుల కోసం లక్ష కోట్ల వ్యయం: ఎమ్మెల్యే రాగమయి

01-07-2026 05:59 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న రైతు భరోసా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు. సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామ రైతు వేదికలో మంగళవారం రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కేవలం తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా పాలనలో రెండున్నర సంవత్సరాల వ్యవధిలో రైతుల సంక్షేమం కోసం దాదాపు లక్ష కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. గత పాలనలో జరిగిన విధ్వంసకర విధానాల నుంచి తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఆమె అన్నారు. దేశంలో ఏ నాయకుడు తీసుకోని సాహసోపేత నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకుని, 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేశారని గుర్తు చేశారు.

రైతులను గతంలో ఇబ్బందులకు గురిచేసిన వారే నేడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. రైతుల పంటలకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. రైతు బంధు పేరుతో ఇతర సంక్షేమ పథకాలను నిలిపివేసి రైతులను కష్టాల్లోకి నెట్టిన పరిస్థితులను ప్రజలు మరువలేదన్నారు. దేశంలోనే అత్యధిక మద్దతు ధరలకు పంటలను కొనుగోలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన భోజన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా పథకం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిరంతరంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే రాగమయి తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలతో ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటోందని, ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోందన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరుతున్నాయని పేర్కొన్నారు. అధికారం కోల్పోయిన వారు రాజకీయ కారణాలతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా రైతుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఠఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ కృతజ్ఞతలు తెలిపారు.