19 March, 2026 | 3:37 AM

Breaking News

రైతులే క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలు

19-03-2026 02:13 AM
  1. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి 

కూరగాయల సాగుకు ప్రభుత్వ తోడ్పాటు: కోదండరెడ్డి

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): కూరగాయల సాగును భారీగా పెంపొందించేందుకు ప్రభుత్వ పూర్తిస్థాయి తోడ్పాటు అందిస్తున్నదని రైతు కమిషన్ చైర్మన్ కోదం డరెడ్డి పేర్కొన్నారు. ఉత్పత్తులకు గిట్టుబా టు ధర పొం దేందుకు రైతులకు అందుబాటులో ఉండేలా గ్రామాల్లో మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని చెప్పారు.

కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో బుధవారం రాజేంద్రనగర్‌లో ఆరు జిల్లాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి ఎంపికచేసిన 150 మంది వెజిటబుల్ వలంటీర్ రైతులకు కూరగాయల సాగుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి  మాట్లాడుతూ.. రైతులే క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలని,

కూరగాయలు విస్తీర్ణం పెంపు బాధ్యతలు రైతులు తమ భుజస్కందాలపై వేసుకొని ముందుకు సాగాలన్నారు. ప్రత్యేకించి కూరగాయల సాగు విస్తీర్ణం, కూరగాయల స్వయం సమృద్ధికి కావాల్సిన సకల సౌకర్యాలు కల్పిం చేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందన్నారు. ఉపాధి హామీ పనులు వ్యవసాయంతో అనుసంధానం చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నట్టు తెలిపారు. తక్కువ ఖర్చుతో కూడిన చిన్న యంత్రాలు రైతులు సులభంగా వాడుకొని సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. ఉద్యాన ఆధారిత ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు.

సాలీనా వర్షపాతం తెలంగాణలో 900 మిల్లీమీటర్లు ఉందని, ఈ వాతావరణం కూరగాయల సాగుకు అత్యంత అనుకూలమని ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ దండా రాజిరెడ్డి అన్నారు. అంతరం రైతులకు క్షేత్ర పర్యటన నిర్వహించి, సాంకేతికతలను ప్రత్యక్షంగా చూపించి, సర్టిఫికెట్ల ప్రదానంచేశారు. కార్యక్రమంలో రిజిస్టర్ భగవాన్, వర్సిటీ అధికారులు లక్ష్మీనారాయణ, సురేశ్‌కుమార్, ప్రశాంత్, కూరగాయల పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ అనితకుమారి, ఉద్యానశాఖ అడిషనల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.