3 August, 2026 | 9:45 AM

విద్యుత్ షాక్ తో రైతు మృతి

03-08-2026 08:33 AM

- రేగడి ఘనపూర్ మూడురోజుల క్రితం నేలకొరిగిన స్తంభాలు.

- మరమ్మతుల కోసం వెళ్లి మృతి చెందిన నర్సింలు.

చేవెళ్ల(విజయక్రాంతి): చేవెళ్ళ మండల పరిధిలోని రేగడి ఘనపూర్ కు గ్రామానికి చెందిన రైతు వడ్డె నర్సిములు (25) విద్యుత్ షాక్ తగిలి మరణించాడు. మృతుని భార్య హరిత ఫిర్యాదు మేరకు చేవెళ్ళ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత మూడు రోజుల క్రితం రేగడిగనాపూర్ పరిధిలో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. దీంతో విద్యుత్తు స్తంభానికి ఉన్న కరెంటు వైర్లు తెగిపడ్డాయి. అదే గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి, శ్రీకాంత్ ఆగష్టు 2 ఆదివారం ఉదయం 8 గంటలకు విద్యుత్ మరమ్మతుల కోసం నర్సింలును తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తెగిపడ్డ తీగలకు విద్యుత్ సరఫరా ఉండడంతో మరమ్మతుల కోసం వెళ్లిన భక్తుడు నర్సింలుకు కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఆ మృతున్ని హుటాహుటిన చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన డాక్టర్స్ అప్పటికే నర్సింలు మృతి చెందారని డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.