19 May, 2026 | 7:28 PM

తెలంగాణ ఎపీ సెట్ లో ర్యాంకు సాధించిన రైతు బిడ్డ

19-05-2026 06:10 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కౌటబి గ్రామానికి చెందిన మల్లెపూల సాయి తేజ ఇటీవల ప్రకటించిన ఏపీసెట్లో 1311 ర్యాంకు సాధించాడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఈయన ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు విద్యార్థిని అభినందిస్తున్నారు. చిన్ననాటి నుండి చదువుల్లో చురుకుగా ఉండే ఈ విద్యార్థి లక్ష్యంతో చదివి అనుకున్నది సాధించాడు. ఈయన పట్టుదల ఇతర విద్యార్థులకు ఆదర్శంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.