calender_icon.png 22 January, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబం సపోర్ట్ ఉండాల్సిందే

21-01-2025 11:54:39 PM

పది పాయింట్ల పాలసీని తప్పుబట్టిన జోస్ బట్లర్

కోల్‌కతా: విదేశీ పర్యటనల సమయంలో ఫ్యామిలీ సపోర్ట్ అవసరమని.. మానసిక, భావోద్వేగ సమయాల్లో వారి మద్దతు నుంచి అందుతుందని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో ఘోర పరాజయం తర్వాత టీమిండియాపై బీసీసీఐ కొరఢా ఝుళిపించింది. పది పాయింట్స్ కూడిన మార్గదర్శకాలను విడుదల చేసింది. విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్ల వెంట వారి కుటుంబ సభ్యులకు గతంలో మాదిరిగా అవకాశం ఉండదు. 45 రోజుల కంటే ఎక్కువ రోజులు సాగే విదేశీ పర్యటనలో మాత్రమే ఆటగాళ్ల కుటుంబానికి రెండు వారాలు అనుమతి ఇస్తారు. భారత్, -ఇంగ్లండ్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది.

మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో జోస్ బట్లర్ మాట్లాడాడు. ఆధునిక యుగంలో విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్లతో కుటుంబం ఉండడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని బట్లర్ పేర్కొన్నాడు. ఆటగాళ్లతో భార్య, పిల్లు ఉండడం భావోద్వేగంగా సోపర్ట్ ఉంటుందని.. కఠినమైన షెడ్యూల్ సమయంలో వారి మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుందన్నారు. ప్రస్తుత కాలంలో చాలా క్రికెట్ ఆడుతున్నారని.. ఆటగాళ్లు ఇంటి వెలుపలే చాలా సమయం గడుపుతున్నారన్నారు. కుటుంబంతో కలిసి ఉండడం ఆటలో పెద్దగా తేడాలుండవని తాను అనుకోనని చెప్పాడు. కుటుంబం ఉండడం వృత్తిపరమైన కట్టుబాట్లకు ఆటంకం కలిగించదని బట్లర్ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా, కుటుంబంతో కలిసి ఉండడం ద్వారా ఇంటికి దూరంగా ఉండడంతో కలిగే భారాన్ని తగ్గించుకోవచ్చని భావిస్తున్నానని చెప్పాడు.