వికలాంగుల ఛాంపియన్ ట్రోఫీ
కొలంబో: శారీరక వికలాంగుల చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. మంగళవారం కొలంబో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఇండియా 79 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. యోగేంద్ర భదోరియా (40 బంతుల్లో 73; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 118 పరుగులకే ఆలౌటైంది. రాధిక ప్రసాద్ (4/19), రవీంద్ర (2/24), విక్రాంత్ (2/15) రాణించి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ‘టోర్నీ ఆద్యంతం భారత కుర్రాళ్లు అదరగొట్టారు. ప్రతీ చాలెంజ్‌ను సమర్థంగా ఎదుర్కొని విజయం సాధించారు. ట్రోఫీ అందుకోవడం మాత్రమే కాదు మంచి ఆత్మవిశ్వాసానని కూడగట్టుకున్నారు’ అని జట్టు హెడ్‌కోచ్ రోహిత్ జలానీ పేర్కొన్నారు.