ఆమ్‌స్టర్‌డామ్: చెస్ మినీ వింబుల్డన్‌గా పేర్కొనే 87వ టాటా స్టీల్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద రెండో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మంగళవారం మాస్టర్స్ విభాగం మూడో రౌండ్‌లో ప్రజ్ఞానంద 60 ఎత్తుల్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసిపై విజయాన్ని అందు కున్నాడు.
ఈ విజయంతో ప్రజ్ఞానంద (2.5 పాయింట్లు) ఉజ్బెకిస్థాన్ గ్రాండ్ మాస్టర్ అబ్దుసత్రోవ్‌తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు. టోర్నీలో మరో 9 రౌం డ్లు మిగిలి ఉన్నాయి. భారత గ్రాండ్‌మాస్టర్లు గుకేశ్, హరిక్రిష్ణ డ్రాలతో సరిపెట్టుకున్నారు. చాలెంజర్స్ విభాగంలో మహిళా గ్రాండ్‌మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్, ఆర్.వైశాలీ పరాజయం చవిచూశారు. సులేమన్లి చేతిలో దివ్య, నొగర్‌బెక్ చేతిలో వైశాలీ ఓటమి పాలయ్యారు.