1 June, 2026 | 3:30 AM

జిల్లా వ్యాప్తంగా విస్తృత వాహన తనిఖీలు

01-06-2026 12:31 AM
  1. 1500 మంది పోలీసు సిబ్బందితో తనిఖీలు
  2. నేర నియంత్రణకు నిరంతర తనిఖీలు
  3. జిల్లా ఎస్పీశరత్ చంద్ర పవార్

నల్లగొండ క్రైం, మే 31 : శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే లక్ష్యంతో శనివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిల్లో నాఖాబందీ నిర్వహించివాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొని తనిఖీలను పరిశీలిస్తూ పోలీసు అధికారులకు పలు సూచ నలు చేశారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా 47 చెక్ పాయింట్లు ఏర్పా టు చేసి విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.

నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండతో పాటు ప్రధాన పట్టణాలు, జాతీ య రహదారులు, రద్దీ కూడళ్లు, అనుమానాస్పద ప్రాంతాలు రాత్రి వేళల్లో యువకుల గుంపులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ప్ర త్యేక నిఘా ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల పత్రా లు, డ్రైవింగ్ లైసెన్సులు, నంబర్ ప్లేట్లు పరిశీలించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సా రించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించ డం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సైలెన్స ర్లు మార్పులు చేసిన వాహనాలు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే మొత్తం 738 వాహనాలపై చర్యలు తీసుకున్నారు.

రాత్రి వేళల్లో అ నుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు నమోదు చేశారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు, అ నుమానాస్పద వాహనాల కదలికలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. . నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు.

ట్రాఫిక్ ని బంధనలు ఉల్లంఘించే వారు, రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశా రు. యువత చట్టాలను గౌరవించి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు. రోడ్లపై స్టం ట్లు చేయడం, అధిక శబ్దాలతో వాహనాలు నడపడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమం లో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.