15 June, 2026 | 8:38 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

చేపలు, చికెన్, మాంసం దుకాణాలపై విస్తృత తనిఖీలు

19-01-2026 12:00 AM
  1. 12 కేసులు నమోదు

తూనికలు కొలతలు శాఖ అధికారి  మనోహర్

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 18 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో వినియోగదారుల హక్కుల పరిరక్షణలో భాగంగా, ఆదివారం తూనికలు కొలతలు శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం సంత ప్రాంతం, కొత్తగూడెం పట్టణం  అన్నపూరెడ్డిపల్లి మండలంలోని చేపలు, చికెన్, మాంసం విక్రయ దుకాణాలపై విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించినట్లు తూనికలు కొలతలు శాఖ అధికారి  కే. మనోహర్ తెలిపారు.

ఈ తనిఖీలలో తూనికలు కొలతల చట్టం, సంబంధిత నిబంధనలను ఉల్లంఘిస్తూ ధృవీకరణ లేని తూకపు యంత్రాలు వినియోగించడం, సరైన ముద్రలు లేకుండా తూకాలు నిర్వహించడం, కొలతల్లో తేడాలు చూపించడం వంటి అక్రమాలు గుర్తించాలన్నారు.  ఈ ఉల్లంఘనలపై మొత్తం 12 కేసులు నమోదు చేశామన్నారు. తూనికలు కొలతల చట్టాన్ని ఉల్లంఘించిన వ్యాపారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం  జరుగుతుందన్నారు. వినియోగదారులను మోసగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.

న్ని వ్యాపారులు తప్పనిసరిగా ప్రభుత్వ ధృవీకరణ పొందిన తూకపు యంత్రాలనే వినియోగించాలని, నిర్ణీత కాలవ్యవధిలో పునఃధృవీకరణ చేయించుకోవాలని సూచించారు. వినియోగదారులు కూడా తూకాల్లో అక్రమాలు గమనించినట్లయితే జిల్లా తూనికలు కొలతలు శాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని కోరారు. భవిష్యత్తులో కూడా జిల్లాలోని సంతలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తూనికలు కొలతలు శాఖ అధికారి  మనోహర్ తెలిపారు.