15 May, 2026 | 3:25 AM

అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించండి

15-05-2026 01:42 AM

కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు, మే 14 : పటాన్ చెరు నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గురువారం సంగారెడ్డిలోని కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా 2025-2026 సంవత్సరానికి సంబంధించిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా చేపట్టబోయే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అమీన్పూర్ డివిజన్ పరిధిలోని వడకపల్లి కోట అభివృద్ధి కోసం హెచ్‌ఎండిఏ అధికారులతో చర్చించడం జరిగిందని.. రెవెన్యూ శాఖ తరపున ఎన్‌ఓసి జారీ చేయాలని కోరారు. హెచ్‌ఎండిఏ నిధులతో కోటను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ప్రజోపయోగ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ఈ  సమావేశంలో అమీన్పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.