ఎఫ్‌సిఎన్‌ఆర్-బి డిపాజిట్ల సమీకరించిన ఐసిఐసిఐ బ్యాంక్
న్యూఢిల్లీ: విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ బ్యాంక్ డిపాజిట్ పథకం(Foreign Currency Non-Resident Bank Deposit Scheme) కింద ఐసిఐసిఐ బ్యాంక్ 17.88 బిలియన్ డాలర్లు సేకరించింది. తద్వారా, తన స్థూల ఎఫ్సీఎన్ఆర్-బీ సమీకరణను వెల్లడించిన తొలి ప్రైవేట్ రుణదాతలలో ఈ బ్యాంక్ ఒకటిగా నిలిచింది. ఇతర బ్యాంకులకు జారీ చేసిన స్టాండ్‌బై లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (Standby letters of credit) మొత్తం 3.63 బిలియన్ డాలర్లు అని భారతదేశపు రెండవ అతిపెద్ద ప్రైవేట్ రుణదాత ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
జూలై-ఆగస్టు కాలంలో బ్యాంక్ మొత్తం $3.55 బిలియన్ల డాలర్ల విలువ గల బాండ్లను జారీ చేసింది. ఆర్బీఐ (Reserve Bank of India) FCNR-B డిపాజిట్ల కోసం ప్రత్యేక రాయితీ విండో ఆగస్టు 31న ముందస్తుగా ముగిసింది. ఎఫ్సీఎన్ఆర్-బీ డిపాజిట్ల(FCNR-B deposits) గడువును ముందుకు తీసుకురావడం ద్వారా కేంద్ర బ్యాంక్ ఆగస్టు మధ్యలో మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ఇతర ప్రముఖ ప్రైవేట్ రుణదాతలు తమ తుది ఎఫ్‌సిఎన్‌ఆర్-బి డిపాజిట్ల గణాంకాలను ఇంకా వెల్లడించలేదు. తాజా ఆర్‌బిఐ డేటా ప్రకారం... ఆగస్టు 21 నాటికి ఎఫ్‌సిఎన్‌ఆర్-బి డిపాజిట్లు 65 బిలియన్ డాలర్లకు పైగా చేరగా, బాహ్య వాణిజ్య రుణాలు (ఇసిబిలు), విదేశీ విదేశీ కరెన్సీ రుణాలు (ఒఎఫ్‌సిబిలు)తో సహా మొత్తం నిధుల ప్రవాహం 72 బిలియన్ డాలర్లను దాటింది.






