నితిన్ నబీన్ పర్యటన రాజకీయాలకే
తెలంగాణకు బీజేపీ ప్రత్యామ్నాయం.. గాలి మాటలే
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్(BJP National President Nitin Nabin) తెలంగాణ పర్యటన రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయాలకే పరిమితమైందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Government Whip Adi Srinivas) అన్నారు. తెలంగాణకు అవసరమైన మెట్రో రెండో దశ, రీజినల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవనం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Rangareddy Project), ఫ్యూచర్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర నిధులు, అనుమతులపై ఒక్క హామీ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం కోరిన ప్రాజెక్టులకు కేంద్రం వెంటనే ఆమోదం తెలిపి నిధులు విడుదల చేయాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం కేవలం గాలిలో మాటలేనని విమర్శించారు.






