బడ్జెట్ ఆమోదం లేకుండా వేల కోట్ల ఖర్చు
శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, మార్చి 20(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2024 వరకు శాసనసభ ఆమోదం లేకుం డా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆం దోళన వ్యక్తం చేస్తూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 204(3) ప్ర కారం, శాసనసభ ఆమోదం లేకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు ఉపసంహరిం చుకోవడం పూర్తిగా చట్ట విరుద్ధమని,అయినప్పటికీ గత పదేళ్లుగా ప్రభుత్వం ఈ నియ మాలను ఉల్లంఘిస్తూ బడ్జెట్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సీఏజీ) నివేదికలను ఉదహరిస్తూ మల్లన్న పలు కీలక అంశాలను ప్రస్తావించారు
* 2014- నుంచి 2018 మధ్య రూ.84,650.99 కోట్ల అదనపు ఖర్చు శాసనసభ ఆమోదం లేకుండా జరిగింది, ఇది ఇప్పటికీ రెగ్యులరైజ్ కాలేదనీ లేఖలో పేర్కొన్నారు.
* 2018- రూ.29,133.69 కోట్లు అ దనంగా ఖర్చు చేయగా.. 2019- రికా ర్డు స్థాయిలో రూ.47,896.44 కోట్లు అధికంగా ఖర్చు చేసి ఆర్థిక క్రమశిక్షణను పూర్తిగా దెబ్బతీశారనీ తెలిపారు.ఇదే కాకుండా, బడ్జెట్లో కేటాయింపులు లేకపోయినా (జీరోఎల్లోకేషన్) వివిధ పథకాల పేరిట భారీగా నిధులు మళ్లించారని ఆరోపించారు:
* 2015- ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏకు రూ.350 కోట్లు, దావత్-ఎ-ఇఫ్తార్కు 14 కోట్లు
* 2017 ఉదయ్ రుణాల వడ్డీకి రూ.708.22 కోట్లు
* 2018- ఎస్‌సీ కార్పొరేషన్‌కు రూ.1,500 కోట్లు, ట్రికొర్‌కు రూ.900 కోట్లు
* 2019- కోవిడ్ పేరిట రూ.1,186.57 కోట్లు
* 2023- హెచ్‌ఎంఎస్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీకు రూ.1,913.91 కోట్లు, ఉదయ్ బాండ్స్‌కు రూ.892.29 కోట్లు
ఈ విధంగా శాసనసభకు తెలియజేయకుండా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం రా జ్యాంగ విరుద్ధమని, ఇది శాసనసభ అధికారాలను అవమానించే చర్య అని మల్లన్న అ న్నారు. ఈ అంశంపై తక్షణమే విచారణ జరి పి, ఆర్థిక శాఖ అధికారులను సభ ముందు హాజరు పరచాలని, రాజ్యాంగ ఉల్లంఘనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారాన్ని ‘బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్‘ కింద పరిగణించి చర్యలు చేపట్టాలని చైర్మన్ కోరారు. ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు చేసే పరిస్థితికి అడ్డుకట్ట వేయాలని, శాసనసభ గౌరవాన్ని కాపాడాలని మల్లన్న కోరారు.




