చెన్నై ఆరేస్తుందా?
గత సీజన్‌లో చివరిస్థానం
సంజూ ఎంట్రీతో పెరిగిన అంచనాలు
ధోనీ మ్యాజిక్‌పైనా సీఎస్కే ఆశలు
అనామక ఆటగాళ్లపైనే భారం
ఐపీఎల్ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఫ్రాంచైజీల్లో చెన్నై సూపర్ కింగ్స్ పేరు ముందుంటుంది. భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో ఎన్నోసార్లు అద్భుత విజయాలతో ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలిచిన ఘనత చెన్నైదే. అలాంటి సీఎస్‌కే గత రెండు సీజన్లుగా తడబడుతోంది. కెప్టెన్సీలో చేసిన ప్రయోగాలు దెబ్బకొట్టాయి. మధ్యలో ధోనీ నడిపించి ఛాంపియన్‌గా నిలబెట్టినా రుతురాజ్‌కు పగ్గాలు అప్పగించిన తర్వాత పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. ఇప్పుడు సంజూ శాంసన్‌ను ట్రేడింగ్ లో దక్కించుకున్న సీఎస్‌కే ఈ సీజన్‌లో సత్తా చాటి ఆరో టైటిల్ గెలుస్తుందా ?
చెన్నై, మార్చి 20: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఐదు టైటిల్స్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ మంత్ర మహేంద్రసింగ్ ధోనీనే.. కూల్ కెప్టెన్సీతో తీవ్ర ఒత్తిడిలో అద్భుతమైన వ్యూహాలతో జట్టును నడిపించే మహేంద్రుడి సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్స్‌గా నిలిచింది. అయితే రిటైర్మెం ట్‌కు చేరువలో ఉన్న ధోనీ స్థానంలో కెప్టెన్సీ మార్పు సీఎస్కేకు చేదు ఫలితాలను మిగిల్చింది.
గత రెండు సీజన్లలోనూ పూర్తిగా నిరాశపరిచింది. 2023లో చివరిసారిగా టైటిల్ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత వరుసగా రెండు సీజన్లలో అట్టర్ ఫ్లాప్ అయింది. 2024లో ఐదో స్థానంలో నిలిచిన చెన్నై గత ఏడాది చిట్టచివరి స్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో మినీ వేలానికి ముందు పలువురు కీలక ఆటగాళ్ళకు గుడ్ బై చెప్పేసింది. ముఖ్యంగా ట్రేడిం గ్ విండోలో రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను వదిలేసి సంజూ శాంసన్‌ను తెచ్చుకుం ది. భవిష్యత్తు కెప్టెన్‌గా అతన్ని తయారు చేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అలాగే వేలంలో గతానికి భిన్నంగా అనామక ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించింది. జట్ట భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఎన్నడూ లేని విధంగా అనామక ఆటగాళ్లు అయిన ప్రశాం త్ వీర్, కార్తీక్ శర్మలపై సీఎస్కే కోట్లు కుమ్మరించింది. రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ స్థానాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ ఇద్దరిని తీసుకుంది.ప్రస్తుతం సీనియర్, జూనియర్ ప్లేయర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ సమతూకంగా కనిపిస్తోంది.
గత సీజన్ దాకా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సారథ్యం వహించిన సంజూ శాంసన్ చెన్నై జట్టులో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనే చూడాలి. ఇక ధోనీ ఇంపాక్ట్ ప్లే యర్‌గా ఆడతాడా లేక వికెట్ల వెనుక పూర్తి బాధ్యతలు తీసుకుంటాడా అనేది ఆసక్తిక రంగా మారింది. సీజన్ మొత్తం ధోనీ ఆడతాడని చెన్నై క్లారిటీ ఇచ్చినా ఏ రోల్ తీసుకుం టాడనేది వేచిచూడాలి. బ్యాటింగ్ లో రుతురాజ్‌కు తోడు సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. అలాగే అండర్ 19లో అదరగొట్టి కెప్టన్ ఆయుష్ మాత్రే కూడా టాపార్డర్‌లో కీలకం కాబోతున్నాడు. వీరితో పాటు డెవాల్ బ్రేవిస్, సర్ఫరాజ్ ఖాన్ కూడా హిట్టర్లే. సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్‌లో ఫార్మాత్‌తో సంబంధం లే కుండా సూపర్ ఫామ్‌లో ఉండడం కలిసొ చ్చే అంశంగా చెప్పొచ్చు.
అటు మిడిల్ ఆర్డర్‌లో ఆల్ రౌండర్లు అన్షుల్ కంబోజ్, శివం దూబే, ఓవర్టన్ వంటి వాళ్లు బలంగా చెప్పొ చ్చు. ముఖ్యంగా దూబే ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో ఎలాంటి మెరుపులు మెరిపించాడో అందరికీ తెలుసు. దీంతో సీఎస్కే ఫినిషర్ రోల్ అతనికే అప్పగించే అవకాశముంది. మరోవైపు బౌలింగ్‌లో నాథన్ ఎల్లి స్ దూరమవడం ఇబ్బందే. అతని ప్లేస్‌ను మ్యాట్ హెన్రీతో భర్తీ చేయనుంది. అలాగే రాహుల్ ఛాహర్, ఖలీల్ అ హ్మద్, గుర్జాప్ నీత్ సింగ్, శ్రేయస్ గోపాల్‌పైనే ఆశలు పెట్టు కుంది. ఓవరాల్ గా ధోనీ పర్యవేక్షణలో రుతురా జ్ గైక్వాడ్ కెప్టెన్, సంజూ శాం సన్ ఫామ్ చెన్నై సూపర్ కింగ్స్ విజయాలను డిసైడ్ చేయబోతున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు
రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, డెవాల్ బ్రెవిస్, మహేం ద్ర సింగ్ ధో నీ, ఉర్విల్ పటేల్, సంజూ శాంసన్(ట్రేడ్ ఇన్), శివమ్ దూ బే, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అ హ్మద్, అన్షుల్ కం బోజ్, గుర్జన్ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లి స్, శ్రేయస్ గోపాల్, ముఖేష్ చౌదరి, అకీల్ హోస్సేన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మ్యాట్ హెన్రీ, రాహుల్ చాహర్, జాక్ ఫోలక్స్




