24 February, 2026 | 10:20 PM

ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం

24-02-2026 08:26 PM

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

రేపు జరిగే పరీక్షకు సుమారు 150 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లు తీసుకుని, నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో నిబంధనలు పాటిస్తూ సహకరించాలని ఆయన విద్యార్థులను కోరారు.