24 February, 2026 | 10:24 PM

కేటీఆర్ వ్యాఖ్యలపై ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్ అలీ విమర్శలు

24-02-2026 08:23 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఎండి ఆసిఫ్ అలీ మాజీ మంత్రి కేటీఆర్  పై తీవ్ర విమర్శలు చేశారు. ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ విప్ ధిక్కరించి ఓటు వేసిన వారికి మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇవ్వడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్ మంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మున్సిపల్ చట్టం–2019 అమలుపై ఇప్పుడు విరుద్ధ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అమలు చేసిన చట్టాన్ని ఇప్పుడు ప్రశ్నించడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. చట్టాలు, పార్టీ విప్ వంటి అంశాలపై స్పష్టమైన అవగాహనతో మాట్లాడాలని, ప్రజల్లోకి వెళ్లి ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవాలని కేటీఆర్‌కు సవాల్ చేశారు.