26 June, 2026 | 11:41 AM

మాదకద్రవ్యాలు సమాజానికి హానికరం: CI రవీందర్

26-06-2026 10:21 AM

రుద్రంగి జూన్(విజయక్రాంతి): రాజన్న సిరిసిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో సిఐ రవీందర్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్ములన కోసం కేరళ స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ.ఇందిరా చౌక్ నుండి పోలీస్టేషన్  వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించామని అన్నారు.అనంతరం విద్యార్థులకు మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి వివరించి మత్తు పదార్థాల నిర్ములాన కోసం ప్రతిజ్ఞ చేయించారు.

యువత మత్తు పదార్థాలకు చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యకరమైన జీవితం పెంపొదించుకోవాలని అన్నారు. యువత గంజాయి, కొకైన్, ఆల్కహాల్ బారిన పడకూడదని మండలంలో ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్లు తెలిస్తే 1908 కి గాని పోలీస్ లకు గాని సమాచారం అందించాలని కోరారు.రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్ములానే లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో,ఏఎస్ఐ రవీందర్,పోలీస్ సిబ్బంది,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.