రైతు ఆశీర్వాద బహిరంగ సభ సన్నాహక సమావేశం
మధిర,జూన్26(విజయక్రాంతి): మధిర మండలంలోని దెందుకూరు గ్రామంలో జూన్ 30వ తేదీన చింతకాని మండలం మత్కేపల్లి గ్రామంలో జరగనున్న రైతు ఆశీర్వాద భారీ బహిరంగ సభను జయప్రదం చేయడానికి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. మధిర పట్టణం దెందుకూరు గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ నివాసంలో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పారుపల్లి విజయకుమార్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అలాగే రాష్ట్ర మంత్రులు పాల్గొంటున్న ఈ భారీ బహిరంగ సభకు దెందుకూరు గ్రామం నుంచి అధిక సంఖ్యలో రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో దెందుకూరు గ్రామ సర్పంచ్ శ్రీ పగిడిపల్లి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ కోట వెంకటకృష్ణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూరంశెట్టి కిషోర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కర్నాటి రామారావు, మధిర పట్టణ అధ్యక్షులు తలుపులు వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు ఓట్ల రాంబాబు వార్డు మెంబర్లు సొసైటీ డైరెక్టర్లు అలాగే గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






