26 June, 2026 | 11:41 AM

త్యాగనిరతికి ప్రతీక మొహర్రం

26-06-2026 10:20 AM

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 

ఖమ్మం,(విజయక్రాంతి): ముస్లిం సోద‌రుల‌కు మాజీ‌మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొహ‌ర్రం శుభాకాంక్ష‌లు తెలిపారు. మొహర్రం త్యాగనిరతికి, సహనానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. నాటి కాలంలో ఇమామ్ హసన్, ఇమామ్ హుస్సేన్ సహా పలువురి త్యాగాలను స్మరించుకుంటూ మొహర్రం సాగుతుందన్నారు. ముస్లింలు, హిందువులు కలిసి నిర్వహించే 'పీర్ల' ఊరేగింపు ప్రజల మధ్య సఖ్యతను, ఐక్యతను, గంగా-జమునా తెహజీబ్‌ను చూపే సందర్భం అని ఈ పవిత్ర మొహర్రం పర్వదినం సందర్భంగా శాంతి, సౌభాగ్యం, మత సామరస్యం వెల్లివిరియాలని మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు.